Movie Muzz

ప్రభాస్ ‘రాజా సాబ్’తో నిధికి బ్రేక్ వస్తుందా?

ప్రభాస్ ‘రాజా సాబ్’తో నిధికి బ్రేక్ వస్తుందా?

నిధి అగర్వాల్ 2016లో ‘మున్నా మైకేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం 2018లో నాగచైతన్య సరసన నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో రెండు సినిమాల్లో నటించినప్పటికీ, రామ్ పోతినేనితో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నిధికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ ఫేమ్‌తో తరువాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్లు మాత్రం రాలేదు.

‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత ఆమెకు దక్కిన పెద్ద అవకాశం పవన్ కళ్యాణ్ సరసన చేసిన ‘హరి హర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమా చాలా కాలం షూటింగ్ జరుపుకుని 2025 జులైలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇప్పటికీ నిధి అంటే ప్రేక్షకులకు ‘ఇస్మార్ట్ బ్యూటీ’ అనే గుర్తింపే మిగిలింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక సినిమా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమాపై నిధితో పాటు ఆమె అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

editor

Related Articles