సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు ఇప్పటికే పెద్ద స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. గతంలోనే పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో కేమియో రోల్స్‌లో కనిపిస్తారని యూనిట్ వెల్లడించింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మరో వెర్సటైల్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సేతుపతి సీన్లను గోవాలో చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఆయన నిజంగానే ఈ చిత్రంలో నటిస్తున్నారా? అన్న విషయంలో మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రజనీకాంత్–సేతుపతి కాంబినేషన్ ఇదే మొదటిసారి కాదు; ఇంతకుముందు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పెట్టా’లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో స్క్రీన్‌పై ఎలా అలరిస్తుందో ఆసక్తి నెలకొంది. ‘జైలర్ 2’లో విజయ్ సేతుపతి లుక్, పాత్రపై అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.!
- November 27, 2025
0
58
Less than a minute
You can share this post!
editor

