Movie Muzz

సంక్రాంతికి కొత్త సినిమా ‘అనగనగా ఒకరాజు’

సంక్రాంతికి కొత్త సినిమా ‘అనగనగా ఒకరాజు’

‘జాతిరత్నాలు’ ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ వంటి సినిమాలతో కావాల్సినంత వినోదాన్ని పంచిన ఆయన మరోమారు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒకరాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ఆభరణాల స్ఫూఫ్‌తో ఆరంభమైన టీజర్‌ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కోనసీమ నేపథ్యంలో కామెడీ, రొమాన్స్‌ అంశాల కలబోతగా ఆకట్టుకుంది. సంక్రాంతి పండగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాన్ని అందించే చిత్రమిదని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాకి కెమెరా: జె.యువరాజ్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌.

administrator

Related Articles