సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పాన్ ఇండియా నుండి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమాయే “కూలీ”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేష్ కనగరాజ్ సినిమాలకి ప్రమోషన్స్ దాదాపు ఇంటర్వ్యూస్‌తోనే గడిచిపోతాయి. కానీ ఇప్పుడు కూలీ కోసం అంతకు మించి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కూలీ పోస్టర్స్ ఇప్పుడు పలు అమెజాన్ డెలివరీ కొరియర్స్‌పై కనిపిస్తున్నాయి. దీంతో ఈ రకంగా కూడా ప్రమోషన్స్ చెయ్యొచ్చా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి మాత్రం కూలీ ఒక సరికొత్త ఐడియా అందించింది అని చెప్పవచ్చు. ఇక దీనిపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అలాగే అవైటెడ్ కూలీ ఈ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా తెలుగు, తమిళ్, హిందీ అలానే కన్నడలో కూడా రిలీజ్ కాబోతోంది.

- July 31, 2025
0
79
Less than a minute
Tags:
You can share this post!
editor