చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ డెబ్యూ చేసిన రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్న ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ సృష్టించింది. ఇప్పుడు చిత్రబృందం ఎక్సైటింగ్ రిలీజ్ అప్‌డేట్ ప్రకటించింది — ‘నారి నారి నడుమ మురారి’ 2026 సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇది పర్ఫెక్ట్ సీజన్ కావడంతో సినిమా బలమైన వసూళ్లు సాధిస్తుందని టీమ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. శర్వా గత సంక్రాంతి హిట్స్ అయిన ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రికార్డ్‌ను ఈ చిత్రం మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, జ్ఞానశేఖర్ విఎస్ – యువరాజ్ జంటగా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కథను భాను బోగవరపు రాశారు.
- December 6, 2025
0
43
Less than a minute
You can share this post!
editor


