నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’. ఈ సినిమాను యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల ఈ చిత్రాన్ని ఆసక్తికరమైన కథతో తెరకెక్కిస్తున్నారు. పెళ్లి చుట్టూ సాగే వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగడం విశేషం. నేచురల్ ఎమోషన్స్, ఫన్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో కథ సాగనుంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం మరో ప్లస్. ఇప్పటికే సినిమా టైటిల్‌పై మంచి బజ్ ఏర్పడగా, త్వరలోనే టీజర్, ఫస్ట్ లుక్ వంటి అప్డేట్స్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ వెడ్డింగ్ ఎంటర్టైనర్గా అలరించనుంది.
- January 5, 2026
0
16
Less than a minute
You can share this post!
editor


