టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన సిరి లెల్లను తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్న రోహిత్, అక్టోబర్ 30వ తేదీన రాత్రి 10:35 గంటలకు వివాహ బంధంలోకి అడుగుపెడతారు.
ఈ వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ప్రారంభం కానుండగా, అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లికొడుకు కార్యక్రమం, అక్టోబర్ 28న మెహందీ వేడుక జరగనుంది.
శనివారం నారా రోహిత్, సిరిల హల్దీ వేడుక జరగగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బంధువులు, సన్నిహితుల నడుమ ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పెళ్లి వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

