బన్నీకి బాలయ్య ఫోన్..

బన్నీకి బాలయ్య ఫోన్..

జైలు నుండి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, రానా, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, పుష్ప నిర్మాతలు నవీన్ మరియు రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి వంటి వారంతా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. తాజాగా బన్నీకి  హీరో బాలయ్య ఫోన్ చేసి పరామర్శించారు. బాలయ్య ఫోన్ కాల్‌తో బన్నీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

                 ప్రస్తుతం అల్లు అరవింద్ నేతృత్వంలో నడుస్తున్నా ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య ‘ఆన్ స్టాపబుల్ విత్ NBK’ అనే ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా అల్లు అరవింద్‌కు బాలయ్య ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తోంది.

editor

Related Articles