భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ చిత్రం ‘నాగబంధం’ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించబడింది. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో హీరో రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పై భాగంలో శివుడి రూపంలో పవర్‌ఫుల్‌గా, కింది భాగంలో మోడ్రన్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘నమో రే’ భక్తి గీతం యూట్యూబ్‌లో మంచి స్పందన పొందుతున్నాయి. రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది. భారీ నిర్మాణం, శక్తివంతమైన కథ, విజువల్ గ్రాండియర్‌తో ‘నాగబంధం’ ఈ ఏడాది అత్యంత ఆసక్తికర చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
- March 28, 2026
0
4
Less than a minute
You can share this post!
editor

