గుప్తనిధుల అన్వేషణలో ‘నాగబంధం’

గుప్తనిధుల అన్వేషణలో ‘నాగబంధం’

నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ హీరోయిన్లు. ప్రస్తుతం హీరోయిన్లపై గణేష్‌ ఆచార్య నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. అభే స్వరపరచిన ఈ పాటను కాలభైరవ, అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. విరాట్‌కర్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘నాగబంధం’. ‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ ఉపశీర్షిక. అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కిషోర్‌ అన్నపురెడ్డి తెరకెక్కిస్తున్నారు. కాసర్ల శ్యామ్‌ పాటలు రచించారు. పురాణ ఇతిహాసాల నుండి ప్రేరణ పొంది ఈ కథను రచించడం జరిగింది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్‌రాజన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్‌ నామా. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ దేవాలయాల్లో ఇటీవల కనుగొనబడిన గుప్తనిధుల నుండి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేతమైన అన్వేషణ ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది.

editor

Related Articles