Movie Muzz

‘ఇస్మార్ట్’ బ్యూటీఅన్ స్టాపబుల్…!

‘ఇస్మార్ట్’ బ్యూటీఅన్ స్టాపబుల్…!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నభా నటేష్ కు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ షీ ఇండియా తన ఉమెన్స్ డే స్పెషల్ ఎడిషన్ కవర్ పేజ్ పై నభా నటేష్ ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో బాక్సింగ్ లుక్‌లో ఉన్న నభా నటేష్ ఫోటోను “నభా నటేష్ అన్ స్టాపబుల్” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రేరేపిస్తున్న ప్రతి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కవర్ పేజ్‌ను విడుదల చేసింది.

ఇక నభా నటేష్ కెరీర్ విషయానికి వస్తే, ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తర్వాత రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమైన నభా ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మరియు నాగబంధం సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Related Articles