టాలీవుడ్‌లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో పరిచయమైన గ్లామర్ బ్యూటీ నభా నటేష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందేందుకు దూసుకెళ్తోంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా లైట్ ఆరెంజ్ లంగా వోణీలో రాధా గెటప్‌లో ఆమె ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నభా అందం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’లో నిఖిల్ సరసన కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ అనే పౌరాణిక థ్రిల్లర్‌లో పార్వతీ పాత్రలో కనిపించనుంది. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుండటంతో నభా నటేష్ కెరీర్‌కు పెద్ద బూస్ట్ లభించనుంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే ‘స్వయంభూ’ లాభాల్లోకి వెళ్లిందన్న వార్తలు ఆసక్తి పెంచుతున్నాయి. దీంతో ఈసారి నభా పాన్ ఇండియా స్టార్‌డమ్ సాధించడం ఖాయమని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
- March 2, 2026
0
29
Less than a minute
You can share this post!
editor


