మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న ‘మిస్టీరియస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా.. నిర్మాత చాలా పట్టుదలతో తీశారు. సినిమా చేస్తున్న టైంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.
ఒక కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని చెప్పారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ మహితో కలిసి మూవీ చేస్తామని అనుకోలేదు. కానీ, మిస్టీరియస్ అది జరిగింది. ఈ మూవీ స్టోరీ మహి చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. అందుకే కష్టపడి చేశాం. మా ఈవెంట్‌కు బ్రహ్మానందం గెస్ట్ రావడం హ్యాపీగా ఉంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్ లో విడుదల చేయాలనీ అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తమ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సహా నిర్మాత ఉషా, శివానీ మాట్లాడుతూ, ‘సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం.


