Movie Muzz

మిస్టీరియస్: 19న తెరపై ఏం జరుగబోతుందో తెలుసా?

మిస్టీరియస్: 19న తెరపై ఏం జరుగబోతుందో తెలుసా?

రోహిత్ హీరోగా అబిద్ భూషణ్‌ పోలీస్ పాత్రలో నటించిన సినిమా “మిస్టీరియస్”. రియా కపూర్ , మేఘనా రాజ్ పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ ను మీడియాకు తెలిపారు నిర్మాత జయ్ వల్లందాస్. ఆయన మాట్లాడుతూ .. మా “మిస్టీరియస్” సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను యూఎస్ లో ఉంటాను. సినిమా రంగం మీద ఆసక్తితో టాలీవుడ్ కు వచ్చాను. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో “మిస్టీరియస్” చిత్రాన్ని నిర్మించాను. ఈ మూవీ స్టోరీ మహి చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. తొలి ప్రయత్నంలో ఒక కథా బలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించడం సంతృప్తిగా ఉంది. మా మూవీ టైటిల్ బాగుందనే రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాను ఈ నెల 12నే రిలీజ్ చేయాల్సిఉంది. అయితే అఖండ 2 రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

editor

Related Articles