తండ్రే నా పాలిట యముడు.. కొట్టి గాయాల‌పై కారం జల్లి..

తండ్రే నా పాలిట యముడు.. కొట్టి గాయాల‌పై కారం జల్లి..

గాయ‌త్రీ గుప్తా.. ఈ అమ్మాయి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల క‌న్నా వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవికి స్నేహితురాలిగా నటించి గుర్తింపు పొందారు. అయితే ఈమె ఇటీవ‌లి కాలంలో ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో షాకింగ్ కామెంట్స్ చేస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తూ ఉంటోంది. తాజాగా ఆమె చేసిన ఓపెన్ కామెంట్స్ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ నిజంగానే ఉంది అని స్పష్టం చేశారు. “కొంతమంది నటీమణులు అవకాశాల కోసం కమిట్‌మెంట్లు ఇస్తున్నారు. వాళ్లకు అది సరైనదిగా అనిపించవచ్చు. అదే సమయంలో, అమ్మాయిలంతా మంచివాళ్లు కాదు, అబ్బాయిలంతా చెడ్డవాళ్లు కాదు,” అని చెప్పింది. గాయత్రి వ్యాఖ్యల్లో అత్యంత సంచలనంగా మారిన విషయం ఏంటంటే.. ఆమె తండ్రి పట్ల చేసిన వ్యాఖ్యలు. అమ్మాయిలు ఎక్కువగా తండ్రిలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. కానీ నాకు ఫాదర్ అంటేనే అసహ్యం వేస్తోంది. నా తండ్రే నన్ను చిత్రహింసలు పెట్టాడు. కరెంట్ వైర్‌తో కొట్టడం, ఆ గాయాలపై కారం జల్లడం వంటివి చేసి అమానుషంగా వ్యవహరించాడు” అని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఆమెపై అనేక రకాల రేప్ ఎటాక్స్ జరిగినట్లు ఆమె వెల్లడించారు. వాటి గురించి బయటకు చెప్పినందుకే తన కెరీర్ దెబ్బతిందని కూడా వాపోయారు. ఒక సినిమా పార్టీలో తాగాల్సి వచ్చింది. తరువాత, నన్ను డ్రాప్ చేస్తానంటూ ఓ డైరెక్టర్, ఓ నిర్మాత ఇంటికి తీసుకెళ్లాడు. ఆ నిర్మాత నా డ్రస్ లాగడం, అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. నా డ్రస్సే ఆ రోజున నన్ను కాపాడింది. ఎంత లాగినా అది రాక‌పోవ‌డంతో వ‌దిలేసి వెళ్లారు అని ఆమె వెల్లడించారు. ఒక ఈవెంట్ మేనేజర్ కూడా నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు అని చెప్పుకొచ్చారు. ఆమె చెప్పిన మాట‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలో పలు చర్చలకు తావిస్తున్నాయి. ఆమె అనుభవాలు ఒకవైపు కలవరపెడుతుంటే, మరోవైపు మహిళల భద్రతపై పలు ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.

editor

Related Articles