టాలీవుడ్ నటి కల్పిక గణేష్ ఇటీవల వరుస వివాదాలతో వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘యశోద’, ‘హిట్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇటీవల తరచూ వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో హైదరాబాద్‌లోని ప్రిజమ్ పబ్‌లో ఆమె ప్రవర్తనపై పెద్ద హంగామా చేసిన విషయం మీకు తెలిసిందే. అక్కడ పబ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీసుల ఎదుటే బూతులు తిడుతూ రెచ్చిపోయిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటనపై పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. రీసెంట్‌గా, నగర శివారులోని ఓ రిసార్ట్‌లో కూడా కల్పిక నానా హంగామా సృష్టించింది. రిసార్ట్ మేనేజర్‌తో పాటు సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించి, వారిని బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. ఎందుకు ఆమె ఇలా ప్రవర్తించిందో అర్థంకాక, అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని, ప్రశాంతత కోసం అక్కడికి వెళ్లినా ప్రశాంతత దక్కలేదని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తూ గట్టిగా స్పందించింది. అయితే నెటిజన్లు ఆమె ప్రవర్తనపై తీవ్రంగా స్పందించారు. “నీకు మానసిక వైద్యం అవసరం” అంటూ కామెంట్లు చేశారు. ఇదే తరుణంలో కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన కుమార్తె మానసిక సమస్యతో బాధపడుతోందని, గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిందని, రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించినా అక్కడ ఉండకుండా తిరిగి వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు.

- August 1, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor