‘మై బేబీ’ జులై 18న గ్రాండ్ రిలీజ్

‘మై బేబీ’ జులై 18న గ్రాండ్ రిలీజ్

ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తోంది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి ఈ సినిమాని ‘మై బేబి’ పేరుతో ఈనెల జులై 18న విడుదల చేయబోతున్నారు. ఈ సంద‌ర్భంగా సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి 15 విజయవంతమైన సినిమాలను నిర్మాతగా అందించిన సురేష్ కొండేటి, డిస్ట్రిబ్యూటర్‌గా 85కు పైగా సినిమాలను విడుదల చేశారు. ‘మై బేబి’ ఆయన నిర్మాణంలో వస్తున్న 16వ సినిమా. ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధర్వ మురళి, నిమిషా సజయన్‌ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వం వహించారు. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన ఆధారంగా ఈ కథ రూపొందిందని చిత్ర బృందం తెలిపింది. సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి ఈ సినిమాకి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

editor

Related Articles