తన జీవితంలో జరిగిన ప్రేమకథే ‘మిస్టర్‌ రెడ్డి’

తన జీవితంలో జరిగిన ప్రేమకథే ‘మిస్టర్‌ రెడ్డి’

స్వీయ నిర్మాణంలో టీఎన్‌ఆర్‌ (టి.నరసింహా రెడ్డి) హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా ‘మిస్టర్‌ రెడ్డి’. వెంకట్‌ రెడ్డి ఓలాద్రి రచన, దర్శకత్వం వహించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత టీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన ప్రేమకథ ఇదని చెప్పారు. ఈ లవ్‌స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని, భావోద్వేగాలతో పాటు వినోద ప్రధానంగా మెప్పిస్తుందని దర్శకుడు వెంకట్‌ ఓలాద్రి పేర్కొన్నారు. మహదేవ్‌, అనుపమ ప్రకాష్‌, దీప్తి శ్రీరంగం, భాస్కర్‌, మల్లికార్జున్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: కెఎస్‌ఆర్‌ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.

editor

Related Articles