జాసన్ ఫోకస్ ఇప్పుడైతే దర్శకత్వమే

జాసన్ ఫోకస్ ఇప్పుడైతే దర్శకత్వమే

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ త్వరలో ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వాటిపై సంజయ్ స్పందించారు. సినిమాల్లోకి రావాలన్న తన నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించిందని చెప్పారు. ‘సిగ్మా’ ప్రారంభ సమయంలో విజయ్ సేతుపతితో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని, అదే తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

గతంలో తనకు నటించే అవకాశం వచ్చినా, అప్పట్లో కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటుండటంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. సెట్స్‌లో నటీనటులకు సన్నివేశాలు వివరిస్తున్నప్పుడు తనలో నటుడు కూడా ఉన్నాడనే భావన కలిగిందని చెప్పారు.

అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి ‘సిగ్మా’ సినిమాపైనే ఉందని, సినిమా విడుదలైన తర్వాత నటుడిగా కొనసాగాలా లేదా దర్శకుడిగానే ముందుకు వెళ్లాలా అనే నిర్ణయం తీసుకుంటానని జాసన్ సంజయ్ స్పష్టం చేశారు.

Related Articles