గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ హీరో శ్రీకాంత్ మెహన్ లాల్ సినిమా, “వృషభ” షూటింగ్ ఆగిపోయినట్టుగా తెలిపారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత ఏడాది జూలైలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. నందకిషోర్ దర్శకుడు. మోహన్ లాల్ ప్రధన పాత్రలో నటించగా, శ్రీకాంత్, రాగిని ద్వివేది, షనాయా కపూర్ తదితర నటులు కూడా నటిస్తున్నారు. తండ్రి కొడుకుల అనుబంధం నెపథ్యంలో తెలుగు సహా మలయాల భాషలో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే నిర్మాతతో కోన్ని ఇబ్బందుల కారణంగా ఈ సినిమా ఆగిపోయినట్లుగా ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం రోషన్ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నారు. ఇక వృషభ సినిమా రోషన్ ఖాతాలో లేనట్టే.