గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇప్పటికే తమ సంతాప సందేశాన్ని తెలియజేశారు. తనదైన విలనిజంతో భయపెట్టిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇప్పటికే తమ సంతాప సందేశాన్ని తెలియజేశారు. నటుడు మోహన్ బాబు కోట మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కోట శ్రీనివాసరావుగారు మరణించారని తెలిసిన తర్వాత చాలా బాధేసింది. ఆయనను చూస్తూ, ఆయన దగ్గర నేర్చుకుంటూ పెరిగిన మనందరికీ ఈ నష్టం వ్యక్తిగతంగా తీరని లోటనిపిస్తుంది. కోట శ్రీనివాస రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ మోహన్ బాబు ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు.

- July 14, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor