బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మించిన ఈ సినిమా 18 శుక్రవారం నాడు థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తొలి టికెట్‌ని సోమవారం మేకర్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కవి బెల్లి యాదయ్య సినిమా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ‘ఇది భిన్నమైన సినిమా. ఇందులో నెగెటివ్ పాత్రల మధ్య ప్రేమ, పాటలు ఉంటాయి. ఒక మంచి సందేశాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం అని తెలిపారు. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకి సంగీతం: గజ్వేల్ వేణు.

- July 15, 2025
0
44
Less than a minute
Tags:
You can share this post!
editor