Movie Muzz

ఇది మొదటిసారి కాదు…‘మన శంకరవరప్రసాద్ గారు’..?

ఇది మొదటిసారి కాదు…‘మన శంకరవరప్రసాద్ గారు’..?

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి స్పందన పొందాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తిరుపతిలో ఘనంగా లాంచ్ చేశారు. ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్ ఫ్యామిలీ లైఫ్‌లోకి వచ్చాక ఎదుర్కొనే అనూహ్య పరిస్థితులే కథకు ప్రధాన ఆకర్షణ. చాలా రోజుల తర్వాత చిరంజీవి హిలేరియస్ రోల్‌లో కనిపించడం అభిమానులకు మెగా ట్రీట్‌గా మారింది. ఆయన స్వాగ్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ మరోసారి మెగాస్టార్ రేంజ్‌ను చూపిస్తున్నాయి. నయనతార సంప్రదాయ లుక్‌లో మెరిసితే, వెంకటేష్ మాస్ ఎంట్రీ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలం. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైన ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.

Related Articles