‘మాస్‌ జాతర’ఈ నెల 27న రిలీజ్..

‘మాస్‌ జాతర’ఈ నెల 27న రిలీజ్..

రవితేజ నటిస్తున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాస్‌ జాతర’. ఇది రవితేజ నటిస్తున్న 75వ సినిమా కావడం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

రవితేజ నుండి ఆడియన్స్‌ ఆశించే అన్ని అంశాలూ ‘మాస్‌ జాతర’లో ఉన్నట్టు టీజర్‌ చెబుతోంది. టీజర్‌లో రవితేజ వింటేజ్‌ ఎనర్జీతో కనిపిస్తున్నారు. రవితేజ శైలి యాక్షన్‌తో నిండిన ఫుల్‌ మీల్స్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, మాస్‌ అంశాలతోపాటు వినోదాన్ని మేళవిస్తూ దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాను మలిచారని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాకి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

editor

Related Articles