పెళ్లి అంటేనే భయం వేస్తోంది: శ్రుతి హాసన్

పెళ్లి అంటేనే భయం వేస్తోంది: శ్రుతి హాసన్

పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది త‌మిళ, తెలుగు హీరోయిన్, సింగ‌ర్‌ శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం వేస్తోందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రుతి మాట్లాడుతూ.. పెళ్లి అంటే నాకు చాలా భయం. అది నా స్వేచ్ఛను హరిస్తుంది. ఒకసారి తాను పెళ్లికి చాలా దగ్గరగా వచ్చానని, అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న ఆ బంధం మ‌ధ్య‌లోనే ముగిసిందని శ్రుతి వెల్లడించారు. అందుకే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని తెలిపింది. చాలామంది అమ్మాయిలు పెళ్లి, పిల్లలు వంటి బంధాల్లో పడి తమ స్వేచ్ఛను కోల్పోతున్నారని నేను భావిస్తున్నాను. ఒక న‌టిగా నా అభిరుచులను, స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయ‌మ‌ని శ్రుతి పేర్కొన్నారు. అయితే, ప్రేమకు తాను వ్యతిరేకం కాదని, ప్రేమలో ఉండటాన్ని తాను ఆస్వాదిస్తానని శ్రుతి వివరించారు. ప్రస్తుతం శ్రుతిహాసన్ కూలీ  సినిమాలో న‌టిస్తోంది. కూలీ ఆగ‌స్టు 14న రిలీజ్ కాబోతోంది.

editor

Related Articles