Movie Muzz

సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి..?

సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ ట్రైలర్ సంచలనంగా మారింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. చిరంజీవి గత చిత్రాల ట్రైలర్లతో పోలిస్తే ఇది రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించడం విశేషం.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, తొలిసారి వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై చూడబోతుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. వినోదం, హాస్యం, మాస్ అప్పీల్‌తో నిండిన ట్రైలర్‌లో చిరంజీవి–వెంకటేష్ కాంబో సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. డిఫరెంట్ ప్రమోషన్స్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Related Articles