ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ సినిమాలో మ‌ల‌యాళ న‌టులు.!

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ సినిమాలో మ‌ల‌యాళ న‌టులు.!

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కేజీఎఫ్, స‌లార్ సినిమాల ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ఎన్.టి.ఆర్. – నీల్ అంటూ రానున్న ఈ సినిమాని మైత్రీ  మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది (2026) స‌మ్మ‌ర్ కానుక‌గా.. జూన్ 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ న‌టులైన టోవినో థామ‌స్, బీజు మేన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నట్లు న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న ఈ డ్రాగ‌న్ గురించి మాట్లాడుతూ.. ప్ర‌శాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమాలో టోవినో థామ‌స్, బీజు మేన‌న్ న‌టించ‌బోతున్నారు. వారిద్ద‌రికీ ప్ర‌శాంత్ నీల్ బెస్ట్ రోల్స్ ఇస్తాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉందంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌ అవుతోంది.

editor

Related Articles