హీరోగానే కాదు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నాడు. విజయ్ సేతుపతి తమిళంలో ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే, అంతకు ముందే పలు సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టారు. ‘పిజ్జా’ సినిమా విజయంతో టర్నింగ్ పాయింట్ వచ్చింది. తర్వాత ‘సేతుపతి’, ‘విక్రమవేద’, ‘96’, ‘మాస్టర్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే విలన్‌గానూ ఆయన నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి, 2021లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గాను తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. విజయ్ సేతుపతికి ఇప్పుడు పాన్ – ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమాలో విలన్‌గా మెప్పించిన విజయ్, ఇటీవల కత్రినా కైఫ్‌తో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ సినిమాలో నటించి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల సెలబ్రిటీలు అంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకే ఒక్క హీరోయిన్‌ను మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆమె ఎవరో తెలుసా? మన తెలుగు హీరోయిన్ అంజలి!

- September 27, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor