మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన బ్యూటీ కృతి సనన్. తొలి సినిమా ఫెయిలైనప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం ఈ హీరోయిన్‌కి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఆమె నటించిన ‘హీరో పంతీ’ హిందీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో అక్కడ సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో నాగచైతన్యతో ‘దోచెయ్’ సినిమా చేయగా, ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌కి చాలా రోజుల పాటు దూరంగా ఉంది. ఇక ఆ మధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో పలకరించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో కృతి టాలీవుడ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఈ హీరోయిన్ హాట్ టాపిక్ అవుతోంది. కారణం ఇటీవల కాలంలో వ్యాపారవేత్త కబీర్ బహియాతో ఆమె ప్రేమలో పడినట్టు గాసిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి ఫొటోలు, వీడియోలు అనేకసార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఇండియా – ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ వీక్షిస్తూ కెమెరాలకు చిక్కారు. కబీర్ స్వయంగా కృతితో దిగిన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ఈ రిలేషన్ అఫీషియల్ అయినట్టేనని చెవులు కొరుక్కుంటున్నారు. కబీర్‌కు లండన్‌లో బిజినెస్‌లు ఉండటంతో ఎక్కువగా అక్కడే ఉంటాడట. కృతి సైతం షూటింగ్‌లు లేనప్పుడు ఎక్కువ సమయం అతనితోనే గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో జరిగిన ఓ స్నేహితుడి పెళ్లిలో వీరిద్దరూ కలుసుకున్నారట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఒకరి అభిప్రాయాలు, ఆసక్తులు కలవడంతో రిలేషన్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. పెళ్లి విషయంపై స్పష్టత లేదు కాని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లి జరుగవచ్చని బాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

- July 15, 2025
0
98
Less than a minute
Tags:
You can share this post!
editor