తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా SSMB29. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా తీసుకెళ్లిన క్రియేటివ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో మరో వండర్ క్రియేట్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ బజ్ ఉంది. ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్‌ని, ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్‌ని చేసేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, విజువల్స్… ఇలా ప్రతి యాంగిల్‌లోనూ ది బెస్ట్ అనిపించుకునేలా తెరకెక్కించి శభాష్ అనిపించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో జక్కన్న వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, వర్సటైల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘SSMB29’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన తాజా సినిమా ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే ప్రతీ కథా భారీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. ఆయన కథను చెప్పడంతో పాటు, విజువల్స్‌తో వండర్ క్రియేట్ చేయడంలో అసాధారణ ప్రతిభ కలిగిన దర్శకుడు అని అన్నారు. అంతేకాకుండా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుందని పృథ్వీరాజ్ సుకుమారన్ హామీ ఇచ్చారు. ఇది మహేష్ బాబు కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సినిమాగా కనిపిస్తోంది.

- July 24, 2025
0
106
Less than a minute
Tags:
You can share this post!
editor