మ‌హేష్‌బాబు తండ్రిగా అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు..

మ‌హేష్‌బాబు తండ్రిగా అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు..

ప్ర‌స్తుతం నిర్మిస్తున్న  సినిమాల‌లో మ‌హేష్‌ – రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా ఒక‌టి. ‘SSMB 29’ సినిమా భారీ ఎత్తున రూపొందుతోంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో హైప్ తారాస్థాయిలో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో కోలీవుడ్ హీరో ఆర్ మాధవన్ జాయిన్ అయినట్లు టాక్. ఆయన సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం నిర్మాతలు ముందుగా నానా పాటేకర్, విక్రమ్ వంటి స్టార్స్‌ను కూడా సంప్రదించినట్లు సమాచారం. ఒడిశా, హైదరాబాద్‌లలో కీలక షెడ్యూల్స్ పూర్తిచేసిన టీమ్ కొంతకాలం విరామం తీసుకుంది. ప్రస్తుతం రాజమౌళి నేతృత్వంలో తాజా షెడ్యూల్ కెన్యాలో ప్రారంభమైంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్‌లను అక్కడ అంబోసెలీ నేషనల్ పార్క్‌ సహా ఇతర అటవీ ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ప్రపంచ యాత్రగా ఉండబోతోందట. దీనికి రామాయణంలో ‘సంజీవని’ ఇతివృత్తం ఆధారమని వినిపిస్తోంది.

editor

Related Articles