సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ఐకానిక్ క్లాసిక్ చిత్రం ‘అతడు’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టైమ్‌లెస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్‌లో గ్రాండ్‌గా రీ–రిలీజ్ కానుంది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వెటరన్ నటుడు–నిర్మాత మురళీ మోహన్ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
మహేష్ బాబు స్టైలిష్ లుక్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, క్లాస్ మేకింగ్, అద్భుతమైన పాటలు, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ‘అతడు’ తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం సూపర్ 4K విజువల్స్ మరియు డాల్బీ ఆడియోతో మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. థియేటర్ లిస్టులు, బుకింగ్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. పెద్ద తెరపై ఈ క్లాసిక్‌ని మళ్లీ అనుభవించేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


