రాజకీయాల్లోకి మహానటి..!

రాజకీయాల్లోకి  మహానటి..!

హీరోయిన్స్ రాజ‌కీయాల్లోకి రావ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో చాలామంది హీరోయిన్స్ పాలిటిక్స్‌లోకి వ‌చ్చి చ‌రిత్ర సృష్టించారు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని  ప్ర‌చారం జరుగుతోంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో నేచురల్ యాక్టింగ్‌కు నిదర్శంగా నిలిచిన హీరోయిన్ కీర్తి సురేష్ తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసిన అభిమానులు “TVK… TVK…” అంటూ నినాదాలు చేయడంతో, ఈ వార్తల‌కు మరింత ఊపొచ్చింది. TVK అంటే తలపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK).  ఫ్యాన్స్ కీర్తిని చూసిన వెంటనే TVK అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఆమె విజయ్ అభిమానిగా పలుమార్లు తన ప్రేమను వ్యక్తం చేయడం చూశాం. ఈ నేపథ్యంలో  కీర్తి TVK తరపున 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురై నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కీర్తి సురేష్, విజ‌య్ ఇద్ద‌రూ కలిసి ‘సర్కార్’, ‘భైరవ’ వంటి సినిమాల్లో నటించారు. అప్పట్లో వీరి మధ్య ప్రేమ ఉందంటూ పుకార్లు వచ్చాయి. కానీ ఇటీవల కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు.

editor

Related Articles