ప్రియాంక–నిక్‌జొనాస్‌ల ఏజ్‌ గ్యాప్‌పై మధు చోప్రా

ప్రియాంక–నిక్‌జొనాస్‌ల ఏజ్‌ గ్యాప్‌పై మధు చోప్రా

హీరోయిన్ ప్రియాంక చోప్రా  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో హీరోయిన్లలో ఒకరైన పీసీ.. 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ను వివాహం చేసుకొని లాస్‌ఏంజెల్స్‌లో సెటిల్‌ అయింది. వీరిద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి ప్రియాంక తల్లి మధు చోప్రా  తాజాగా స్పందించారు. ఏజ్‌ అనేది కేవలం సంఖ్య మాత్రమే అని అన్నారు. హృదయాలు, మనసులు కలవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్‌’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుండి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్‌లోనే ఉంటోంది. పలు హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్‌ సినిమాలు నిర్మిస్తోంది. ఇక మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ వరల్డ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఖరారైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్‌ జరుగుతోంది.

editor

Related Articles