మరో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ తెలుగులో ఒక్కరే – ఓ సీరియల్ బ్యూటీ కూడా! మీలో ఎంతమందికి తెలుసు?
హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్స్, పెళ్లిళ్లు, విడాకులు అందరి దృష్టిని ఆకర్షించే విషయాలు. అయితే చాలావరకు సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడం చూస్తున్నాం. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. వారిలో ఓ తెలుగు హీరోయిన్ కూడా ఉంది. అయితే వివాహం వంటి ఒక రిలేషన్ షిప్ నుండి విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ గురించి ఇక్కడ తెలసుకుందాం. వీరిలో మీకు ఎంతమంది తెలుసో చెక్ చేసుకోండి.
కరిష్మాకపూర్ 2016లో దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. సంజయ్ మరణానంతరం సింగిల్ గానే ఉంటోంది కరిష్మా, ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోలేదు.
రేఖ వ్యక్తి గత జీవితానికి సంబంధించే చర్చలకు ముగింపు ఉండదని తెలుస్తోంది. 1990 లో ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది రేఖ. ఆ తర్వాత ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం తరువాత రేఖ తిరిగి రెండో వివాహం చేసుకోలేదు. అంతేకాకుండా ఆమెకు పిల్లలు కూడా పుట్టలేదు.
సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న అమృతాసింగ్‌కు హీరోయిన్ సారా అలీఖాన్, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్‌తో విడాకుల తరువాత అమృతాసింగ్ మరో వివాహం చేసుకోలేదు. కానీ, దేవర విలన్ సైఫ్ అలీఖాన్ మాత్రం బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు.
మనీషా కొయిరాలా 2012 లో సామ్రాట్ దహల్ తో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటి నుండి మనీషా రెండో పెళ్లి చేసుకోలేదు. అతను ఇపుడు మనీషా కొయిరాల తన కెరీర్, కుటుంబంపై మాత్రమే దృష్టి పెట్టింది.
2013 లో మహిమా చౌదరి బాబీ ముఖర్జీకి విడుకులు ఇచ్చారు. విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
పూజాబేడీ 2003లో విడాకులు తీసుకున్నారు. పూజా బేడీకి ఒక కుమార్తె ఉంది. కానీ ఆమె పెళ్లి మళ్లీ చేసుకోలేదు.
బాలీవుడ్ సీరియల్స్ లో హీరోయిన్ గా చేసిన బుల్లితెర బ్యూటీ జెన్నిఫర్ వింగెట్ 2014 లో కరణ్ సింగ్ గ్రోవర్ తో విడాకులు తీసుకున్నారు. కరణ్ ఆ తరువాత బిపాషా బసును వివాహం చేసుకున్నాడు. కానీ, జెన్నిఫర్ మాత్రం రెండో పెళ్లి చేసుకోలేదు.
ఇలా విడుకుల తర్వాత రెండో పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్లలో హిందీ బుల్లితెర సీరియల్ బ్యూటీతోపాటు తెలుగు హీరోయిన్ కూడా ఉన్నారు.
ఆ తెలుగు హీరోయినే సమంత. నాగ చైతన్య సమంత విడాకుల విషయం ఎంత పెద్ద చర్చకు దారితీసిందో తెలిసిందే. అయితే, డైవర్స్ తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం మరొకరిని పెళ్లాడలేదు. కానీ, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్‌లో ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.