దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శివాజీతో కలిసి నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాతో లయ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదని, డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆమె చెప్పారు. ఉత్తర పాత్రలో తాను ఇప్పటివరకు చేయని కొత్త షేడ్‌లో కనిపించబోతున్నానని, ఈ పాత్రలో భావోద్వేగాలతో పాటు హిలేరియస్ మోమెంట్స్ కూడా ఉంటాయని వెల్లడించారు. శివాజీతో తన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని అన్నారు. మొదట ఓటీటీ రిలీజ్ అనుకున్నప్పటికీ, ప్రముఖుల సూచనతో థియేటర్ రిలీజ్‌కు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందన తనకు మరింత నమ్మకం ఇచ్చిందన్నారు. ఇకపై సాఫ్ట్ రోల్స్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందని స్పష్టం చేశారు. కథ నచ్చితే చిన్న పాత్రలైనా చేయడానికి సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం విభిన్న జానర్లలో కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నానని లయ వెల్లడించారు.
- March 3, 2026
0
18
Less than a minute
You can share this post!
editor


