తల్లికి పెళ్లి చేసిన న‌టి కూతురు..

తల్లికి పెళ్లి చేసిన న‌టి కూతురు..

తల్లి కానీ తండ్రి కానీ, మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే… పిల్లలు అంగీకరించకపోవడం చూస్తూ ఉంటాం. అయితే, మలయాళ నటి ఆర్య విషయంలో మాత్రం అంతా భిన్నంగా జరిగింది. ఆమె రెండో పెళ్లికి తోడుగా నిలిచింది ఆమె 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి.
తల్లిని స్వయంగా వివాహ మండపానికి తీసుకెళ్లిన రోయా, మూడు ముళ్ల వేళ తల్లి ముఖంలో మెరుపులు చూస్తూ, తానూ అదే స్థాయిలో ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌యింది. ఈ అద్భుత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ యాంకర్, నటిగా మలయాళంలో పేరు తెచ్చుకున్న ఆర్య, నటుడు, కొరియోగ్రాఫర్ అయిన సిబిన్ బెంజమిన్‌ను వివాహం చేసుకున్నారు. ఇది ఇద్దరికీ రెండో పెళ్లి. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరగగా, ఇటీవల కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిపారు. వివాహ వేడుకలో ఆర్య కుమార్తె రోయా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి దృశ్యాల్లో ఆమె తల్లికి అందించిన‌ సహకారం, అంద‌రి హృదయాన్ని తాకేలా చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ప్రియమణి, పూర్ణ, అశ్వతి శ్రీకాంత్, అర్చన సుశీలన్ తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

editor

Related Articles