ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా, అలాగే రిద్ధి కుమార్‌లు నటిస్తున్న భారీ సినిమా “ది రాజా సాబ్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే రిలీజ్ కావచ్చు, లేని పక్షంలో సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న ఈ బిగ్ సినిమా మొదటి సాంగ్‌పై ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. రీసెంట్‌గా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ రాజాసాబ్ మొదటి పాటని సెప్టెంబర్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు. అలాగే ఫ్యాన్స్‌ని ఎక్సైట్ చేసేందుకు మరింత సాలిడ్ కంటెంట్‌తో రాబోతోంది అని తెలిపారు. సో రాజా సాబ్ మ్యూజికల్ బ్లాస్ట్ బస్టర్ కోసం ఇంకొన్ని వారాలు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సంజయ్‌దత్ తదితరులు నటిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

- August 7, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor