మలయాళం బ్లాక్ బస్టర్ అందుకున్న మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేయబడింది. మలయాళం నుండి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించిన మోహన్ లాల్ ‘ఎల్ 2: ఎంపురాన్’ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో మలయాళీ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూనే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్‌గా ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను కూడా రాబట్టింది. ఈ సినిమా తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 24 నుండి తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది.

- April 18, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor