నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. సామాజిక, ఆర్థిక అంశాలు కలబోసిన సోషల్ డ్రామాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని తీర్చిదిద్దారు. పాటలు, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. ఈ సినిమా నుండి ‘పీ పీ డుమ్ డుమ్’ అనే పాటను ఇటీవల ముంబయిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. హీరోయిన్ రష్మిక మందన్న పాత్ర చుట్టూ ఈ పాటను చిత్రీకరించారు. గర్ల్స్ హాస్టల్‌లో తన మిత్రబృందంతో కలిసి ఆమె ఈ పాటలో ఆడుతూ పాడుతూ కనిపించారు. ‘పీ పీ పీపీ డుమ్ డుమ్.. హలో నమస్తే గర్ల్స్.. ఆర్ యూ రెడీ టూ డ్యాన్స్.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్.. సింగిల్ లైఫ్ సూపర్ యార్..’ అంటూ సింగిల్ లైఫ్‌లో ఉన్న హాయిని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి చైతన్య పింగళి సాహిత్యాన్నందించారు. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
- June 12, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor

