నటనలో జీవించిన కోట ఇక లేరు.. 

నటనలో జీవించిన కోట ఇక లేరు.. 

ప్రముఖ నటులు వారి వారి సంతాపాలు తెలిపిన విధం:

‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను మొదలుపెట్టాం. అనంతరం కోటగారు ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి, తనదైన విలక్షణ శైలితో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. సహాయ నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా.. ఇలా ఏ పాత్రలోనైనా జీవించి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కోట శ్రీనివాసరావు గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు–చిరంజీవి.

‘కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నా తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలుగు తెరపై విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలక్షణ పాత్రలు పోషించారు. తెలుగు భాష, యాసపై ఆయనకు మంచి పట్టుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి–పవన్‌కల్యాణ్‌

‘మేమిద్దరం కలిసి వందల సినిమాల్లో నటించాం. కోట శ్రీనివాస రావు నటరాజపుత్రులు. నటన ఉన్నంత కాలం ఉంటారు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. మేమిద్దరం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కలిసి పనిచేశాం–బ్రహ్మానందం

‘ఇండస్ట్రీలోని అతికొద్దిమంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావుగారు ఒకరు. ఆయన నటన వల్ల శివ, గాయం, మనీ, సర్కార్‌, రక్తచరిత్ర వంటి సినిమాలు మరింత ఎఫెక్టివ్‌గా వచ్చాయి. కోట శ్రీనివాసరావుగారు.. మీరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయినా మీరు పోషించిన పాత్రలు బతికే ఉంటాయి’–రామ్‌గోపాల్‌వర్మ

editor

Related Articles