‘కింగ్‌డమ్‌’  ఈ నెల  31న  రిలీజ్..

‘కింగ్‌డమ్‌’  ఈ నెల  31న  రిలీజ్..

కింగ్‌డమ్‌ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాము ఎంతో ఇష్టపడి ఈ సినిమా తీశామని, ప్రతీ ఫ్రేమ్‌ మెమొరబుల్‌గా ఉండాలనే లక్ష్యంతో శ్రమించామని ఇటీవల సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పడంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ గ్యారంటీ అనే నమ్మకంతో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు. మంగళవారం ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ వెలువడింది. ఈ నెల 26న తిరుపతిలో ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్‌ దేవరకొండకు ఎవరో వీరతిలకం దిద్దుతుండగా, ఆయన బాధ, ఆవేశం ప్రతిఫలించే తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య.

editor

Related Articles