కిల్లర్ ఫస్ట్‌ లుక్ రిలీజ్.. మరి హీరో ఎవరో?

కిల్లర్ ఫస్ట్‌ లుక్ రిలీజ్.. మరి హీరో ఎవరో?

హీరో ఎస్‌జె సూర్య 10 ఏళ్ల తరువాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ సినిమా టైటిల్ కిల్లర్. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గోకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని వి.సి.ప్రవీణ్, బైజ్  గోపాలన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. మేకర్స్ ఈ రోజు కిల్లర్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ఒకవైపు చేతిలో గన్ పట్టుకుని, రెడ్ డ్రెస్‌లో ఉన్న ప్రీతి అస్రానీని భుజాన ఎత్తుకున్న లుక్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు.

editor

Related Articles