లోకేష్ క‌న‌గరాజ్‌తో ఖాన్ సూప‌ర్ హీరో సినిమా..?

లోకేష్ క‌న‌గరాజ్‌తో ఖాన్ సూప‌ర్ హీరో సినిమా..?

షారుఖ్‌ఖాన్ అట్లీతో క‌లిసి జ‌వాన్‌ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు. స‌ల్మాన్ ఖాన్ మురుగుదాస్‌తో క‌లిసి సికింద‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ లిస్ట్‌లోకి మ‌రో ఖాన్ రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ మ‌ళ్లీ సౌత్ ద‌ర్శ‌కుడితో చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు. త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గరాజ్. అమీర్‌ఖాన్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో చేయ‌బోతున్న‌ట్లు గత కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్లే. త్వ‌రలోనే ఏ విషయం అధికారిక ప్ర‌క‌ట‌న‌తో పాటు మిగ‌తా వివ‌రాల‌ను సినిమా బృందం తెలుపుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి మాయావి అనే టైటిల్ అనుకుంటుండ‌గా ఇందులో అమీర్‌ఖాన్ హీరో పాత్ర‌లో న‌టిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాని 2027 క్రిస్మ‌స్‌కి రిలీజ్ చేస్తారుట. ఇక అమీర్‌ఖాన్ ప్ర‌స్తుతం తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న సితారే జమీన్ పర్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. లోకేష్ క‌న‌గరాజ్ ర‌జినీకాంత్‌తో క‌లిసి కూలీ అనే సినిమా షూటింగ్‌లో బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడు.

editor

Related Articles