నటుడు సుదీప్ పాండే గుండెపోటుతో మృతి..

నటుడు సుదీప్ పాండే గుండెపోటుతో మృతి..

సుదీప్ ప్యార్ మే, బల్వా, ధరి వంటి అనేక భోజ్‌పురి సినిమాలలో పనిచేశాడు. భోజ్‌పురి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సుదీప్ పాండే మరణించారు. సుదీప్ కుటుంబ సన్నిహితుల నుండి అందిన సమాచారం ప్రకారం, నటుడు బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. సుదీప్ ప్యార్ మే, బల్వా, ధరి వంటి అనేక భోజ్‌పురి సినిమాలలో పనిచేశాడు. 2019 లో, అతను హిందీ సినిమా V ఫర్ విక్టర్‌లో కనిపించాడు. ఇటీవలే పరో పట్నా వాలి రెండో భాగం షూటింగ్‌ను ప్రారంభించాడు. ఆయన ఆకస్మిక మృతితో ఆయన సన్నిహితులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. “RIP…మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పెట్టాడు. “చాలా త్వరగా పోయాడు” అని మరొక సోషల్ మీడియా వినియోగదారు రాశారు.

editor

Related Articles