‘ఎల్2 ఎంపురాన్’ సినిమాతో ఒకవైపు దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు. కేరళ సినీనటులు ప్రతిష్టాత్మకంగా భావించే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 54వ వేడుకలు కేరళలోని తిరువనంతపురంలో ఘనంగా జరుగగా.. ఈ వేడుకలలో ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ‘ఆడు జీవితం (ది గోట్‌లైఫ్)’ సినిమాకి గాను ఈ అవార్డును అందుకున్నాడు పృథ్వీరాజ్. ఉత్తమ నటిగా సినీయర్ నటి ఊర్వశితో పాటు నటి బీనా ఆర్ చంద్రన్ అవార్డును అందుకోగా.. ఉత్తమ చిత్రంగా మమ్ముట్టి నటించిన కాథల్ ది కోర్ చిత్రం అవార్డును అందుకుంది. మరోవైపు ది గోట్‌లైఫ్ చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచుకుంది.

- April 17, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor