ముంబైలో జరిగిన సింఘమ్ ఎగైన్ ట్రైలర్ లాంచ్‌కు నటి కరీనా కపూర్ ఖాన్ ఫ్యూజన్ లుక్‌లో కనిపించారు. డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆమె చీరలో కొంత భాగం, అంచు అంతా నిజమైన వెండి జర్దోజీ వర్క్ కనబడుతోంది, క్లిష్టమైన డిజైన్ చేసిన కార్సెట్ బ్లౌజ్ ఉన్నాయి. సింఘమ్ ఎగైన్ ట్రైలర్ లాంచ్ నుండి కరీనా కపూర్ ఖాన్ అందమైన రూపాన్ని చూపిస్తూ ఫ్యాన్స్ చూపులను ఆకట్టుకుంటోంది. నటి డిజైనర్ మనీష్ మల్హోత్రా చేతితో నేసిన టిష్యూ చీరను ధరించింది.
నటి కరీనా కపూర్ ఖాన్ తన తాజా చిత్రం సింఘం ఎగైన్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌కి అక్టోబర్ 7, సోమవారం నాడు హాజరయ్యారు. అద్భుతమైన వెండి జరీ అంచు చీరను ధరించింది , ఆమె తన సహ-నటులు అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. పెద్ద ఈవెంట్‌లో ఇతరులతో పాటు చాలామంది సినీపెద్దలు పాల్గొన్నారు.