చికిత్స కోసం యూఎస్‌కు కన్నడ స్టార్ హీరో..

చికిత్స కోసం యూఎస్‌కు కన్నడ స్టార్ హీరో..

కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఆయన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈమేరకు ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ, తాను క్షేమంగానే ఉన్నానని, తోటి నటీనటులు, అభిమానులు చూపే ప్రేమకు ఆనందంగా ఉంది అన్నారు. డిసెంబరు 24న తనకు సర్జరీ జరగనున్నట్లు, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స పూర్తయిన తర్వాత నాలుగు వారాలపాటు అక్కడే ఉండనున్నారు. కోలుకున్నాక ‘యూఐ’, ’మ్యాక్స్’ సినిమాలు చూస్తా అని తెలిపారు.

         అమెరికా వెళ్లడానికి ముందు శివ రాజ్‌కుమార్ ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించగా పలువురు సెలబ్రిటీలు ఆయన్ని కలిసి ధైర్యం చెప్పారు. ‘భైరతి రంగల్’ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్‌లో తోలిసారి తన అనారోగ్యం గురించి ఇలా మాట్లాడారు,” నా ఆరోగ్య సమస్య తెలిసిన వెంటనే భయపడ్డాను, ధైర్యంగా ఎదుర్కునేలా ఆత్మవిశ్వాసాన్ని పొందా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను.” అని తెలిపారు. అమెరికా నుంచి వచ్చి కోలుకున్నాక తిరిగి ‘ఉత్తరకాండ’, ‘భైరవుడు’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

editor

Related Articles