నొప్పితోనే కాంతార ఈవెంట్‌కి హాజ‌రైన ఎన్టీఆర్..

నొప్పితోనే కాంతార ఈవెంట్‌కి హాజ‌రైన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ డెడికేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గ‌త రాత్రి జరిగిన కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై సంద‌డి చేశారు. అయితే ఆయన గాయంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ హాజ‌రు కావ‌డం విశేషం. స్టేజ్‌పైకి వచ్చినప్పుడు నొప్పి కారణంగా కొంత అన్‌కంఫర్టబుల్‌గా కనిపించిన ఎన్టీఆర్, ఎక్కువ సేపు నిలబడలేను, కాస్త నొప్పిగా ఉంది. మీరు సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడటం అక్కడివారిని ఎమోషనల్‌కి గురిచేసింది. ఈవెంట్‌లో త‌న‌ కుడి భుజం కింద ప‌దే ప‌దే త‌డుముతూ మాట్లాడిన‌ ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయం ఇబ్బంది పెట్టినా రిషబ్ శెట్టి కోసం ఈవెంట్‌కు NTR హాజరయ్యారని నెటిజన్లు అభినందిస్తున్నారు.

editor

Related Articles