‘జింగుచా..’ పాటను రచించిన కమల్‌హాసన్‌

‘జింగుచా..’ పాటను రచించిన కమల్‌హాసన్‌

37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్‌హాసన్‌, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్‌ లైఫ్‌’. శింబు, త్రిష కృష్ణన్‌, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి కీలక పాత్రధారులు. ఈ భారీ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. చెన్నైలో ఓ భారీ ఈవెంట్‌ని నిర్వహించి ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో కమల్‌హాసన్‌, మణిరత్నం, ఎ.ఆర్‌.రెహమాన్‌, త్రిష సందడి చేశారు. పెళ్లి వేడుక నేపథ్యంలో ‘జింగుచా..’ అంటూ మొదలయ్యే ఈ పాటను కమల్‌హాసన్‌ స్వయంగా రాయడం విశేషం. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని వైశాలీ సమంత్‌, శక్తిశ్రీ గోపాలన్‌, ఆదిత్య ఆర్‌.కె కలిసి ఆలపించారు. కమల్‌హాసన్‌తో పాటు శింబు, త్రిష, సానియా మల్హోత్రా, నాజర్‌, తనికెళ్ల భరణి ఈ పాటలో ఆడిపాడారు. పెళ్లి వేడుకలో భాగంగా ఈ పాటను చిత్రీకరించినట్టు పాటను చూస్తే అర్థమవుతోంది. శ్రేష్ట్‌ మూవీస్‌ ద్వారా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. వచ్చే నెల 23న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నామనీ, ఈ ఈవెంట్‌లో ఎ.ఆర్‌.రెహమాన్‌ ప్రదర్శన ఇవ్వనున్నారని మేకర్స్‌ తెలిపారు.

editor

Related Articles